భైరవం తర్వాత హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమా కిష్కింధ పురి. అనుపమా పరమేశ్వర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చాలా ఇష్టం. డైరెక్టర్ కౌశిక్ కలిసినప్పుడు కూడా మేము ఇదే మాట్లాడుకున్నాం. అప్పుడు కిష్కింధపురి కథ చెప్పారు. చాలా నచ్చింది. నిజంగా నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చేసాం. నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో చూసాం. సినిమా అదిరిపోయింది. ముఖ్యంగా సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ గారు సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం. థ్రిల్లర్ జానర్ లో చేసిన రాక్షసుడుకి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. మహిళ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకి గొప్ప ఆదరణ లభించింది. చాలా రోజుల తర్వాత కిష్కింధపురి తో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఖచ్చితంగా కిష్కింధపురి’ ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది’
‘దర్శకుడు కౌశిక్ కు మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు గారు ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్ గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు. ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు. హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడో చూడలేదు. హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
‘ఇక అనుపమ పెర్ఫార్మెన్స్ కొత్తగా వుంటుంది. నిజానికి అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా టఫ్. నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను. టీనేజ్ లో ఉన్నప్పుడు కూడా హారర్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది. ఇలాంటి సినిమాలు అందరూ కలిసి ప్యాక్డ్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగు. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది. ఇక నా నెక్ట్స్ సినిమా టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్’ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.